మోడీ రాకను ప్రజలు పూర్తిగా వ్యతిరేకించాలి

– తుమ్మల వెంకటరెడ్డి సిపిఐఎం ములుగు జిల్లా కార్యదర్శి

నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్ర విభజన హామీలను అమలు చేయని ప్రధానమంత్రి మోడీ వరంగల్లు రాకను ప్రజలు పూర్తిగా వ్యతిరేకించాలని సిపిఐ ఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పసర సిపిఐ ఎం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కడారి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయిన రాష్ట్రంలో విభజన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని ప్రధాని ఈనెల 8న వరంగల్ కు వస్తున్నారని మోడీ రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్రానికి రావలసిన ప్రధానమైన విభజన హామీలు ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి 576 ఎకరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కిషన్ రెడ్డి మాకు భూమి ఇవ్వలేదని పేర్కొనడం దుర్మార్గమని పేర్కొన్నారు వెంటనే గిరిజన యూనివర్సిటీ పై మోడీ ప్రకటన చేయాలని అంతే కాకుండా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రకటన చేయాలని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు దెబ్బతింటున్నాయని రాష్ట్రాలపై గవర్నర్ల జోక్యం పెరిగిందని ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పార్లమెంటరీ వ్యవస్థని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. మోడీ రాకను వ్యతిరేకిస్తూ విభజన మీద అమలు చేయాలని రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు ఇచ్చారు. .ఈ కార్యక్రమంలో పొదిల్లా చిట్టిబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్ ,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిపిఎం పార్టీ నాయకులు అంబాల పోశాలు, క్యాతం సూర్యనారాయణ ,సోమ మల్లారెడ్డి, బొచ్చు సంజీవ, గణేష్, రాజేశ్వరి, కవిత, రజిత, అశోక్ రాంబాబు, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.