ప్రజలు పోలీసులను మిత్రులుగా భావించాలి

People should consider the police as friends– ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రజలు పోలీసులను ఒక మంచి మిత్రులుగా భావించాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్ లోఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసుల విధులు, పోలీసుల ద్వారా వినియోగించబడుతున్న వివిధ రకాలైన ఆయుధాలు, వాటి మందు గుండు సామాగ్రి, ఆయుధాల పనితీరు, వాటి తయారీ, ఆయుధాలను తయారుచేసిన సంస్థ దేశాల పేర్లను విద్యార్థులకు వివరించారు. సాయుధ దళంలో పనిచేసే బాంబు స్క్వాడు బృందం విఐపి ల సందర్శన సమయంలో, రోడ్డుకు ఇరువైపులా ప్రయాణించే దారి, కల్వర్టులు, హెలికాప్టర్ నిలుపు ప్రదేశాలు, బాంబులు తనిఖీ చేయడం, వినియోగించే పరికరాలు డీప్ సర్చ్ మెటల్ డిటెక్టర్, నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్, ఓకే డిటెక్టర్ లాంటి వాటి పని విధానాలను వివరించారు. డాగ్ స్క్వాడ్ బృందం చే వివిధ రకాలైన జాతుల జాగిలాలు, వాటి పనితనం, చేసే విధులు అనగా మాదకద్రవ్యాలను కనుగొనడంలో మరియు బాంబులను మందు గుండు సామాగ్రి జల్లటం స్టిక్స్ లాంటి వాటిని కనుగొనడంలో, కీలకంగా నేర స్థలంలో నేరస్తులను వాసన పసిగట్టి కనుగొనే విధానాన్ని, పోలీసు జాగిలాల నైపుణ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న వివిధ రకాలైన పద్ధతులను తెలియజేసి తల్లిదండ్రులకు బంధువులకు విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి సమాచారం అందించి సహాయాన్ని పొందవచ్చును సూచించారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబడిన డిడిఆర్ఎఫ్ బృందం చేయు విధులు, అత్యవసర సమయాలలో డిడిఆర్ఎస్ బృందం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందో వివరాలపై తెలియజేశారు. అత్యవసర సమయంలో ధన, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా త్వరితగతిన స్పందించి జిల్లాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్రావు, డీఎస్పీలు బి సురేందర్ రెడ్డి, సైబర్ క్రైమ్ డిఎస్పి హసీబుల్లా, సీఐ డీసీఆర్బి బి ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, చంద్రశేఖర్, కార్తీక్, కమ్యూనికేషన్ ఎస్ఐ బి గణేష్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.