గోషామహల్ జిహెచ్ఎంసి సర్కిల్ -14 లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) గత కొన్ని రోజులుగా గోషామాల్ సర్కిల్- 14 డిప్యూటీ కమిషనర్ విద్యాధర్, సర్వే నోడల్ అధికారి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎం ఎస్ శైలజ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. శనివారం లోయర్ ధూల్ పెట్ లోని జంగూరు బస్తీలో జిహెచ్ఎంసి సూపర్డెంట్, వార్డ్ ఇంచార్జ్ జే. ధనవతి పర్యవేక్షణలో సూపర్వైజర్ అశోక్, ఎంటమాలజి ఫీల్డ్ అసిస్టెంట్ రాజా,ఎన్యూమరేటర్లు ఏ లావణ్య ,జె లావణ్యలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సహకరించాలని వారు కోరారు.