ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజలు సహకరించాలి ..

People should cooperate in Prajapalan Gram Sabhas..– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్
– ప్రతీ ఒక్కరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ – తాడ్వాయి 
ప్రజా పాలన గ్రామ సభలకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై అర్హులైన లబ్ధిదారులకోసం నిర్వహించే గ్రామ సభల్లో గ్రామ అధ్యక్షులతో పాటుగా నాయకులు కార్యకర్తలలు అందుబాటులో ఉండి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలన్నారు. గ్రామసభలకు వచ్చిన అధికారులకు ప్రజలందరూ సహకరించాలని, ఏమైనా పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఎవరు ఆందోళను చెందొద్దనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చుపటేల్ , మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి, మాజీ సర్పంచ్ లు ఇర్ప సునీల్ దొర, ముజఫర్, సింగిల్ విండో డైరెక్టర్ రంగరబోయిన జగన్, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, నాయకులు ఆలేటి జైపాల్ రెడ్డి, బండారి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.