ఓట్లతో మనోహర్‌ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి

– రూ.కోట్లు పెట్టి టికెట్‌ తెచ్చుకుంటే కాంగ్రెస్‌కు ఓట్లుపడే అవకాశం కరువాయే
– బీఆర్‌ఎస్‌లో ఉండి పదవులు అనుభవిస్తూ యాలాల సొసైటీ చైర్మన్‌ కాంగ్రెస్‌లో చేరడం నమ్మకద్రోహమే
– విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు సి.రవీందర్‌ రెడ్డి,
– సొసైటీ వైస్‌ చైర్మన్‌ వడ్డె రాములు, మాజీ జడ్పీటీసీ సభ్యులు సిద్రాల శ్రీనివాస్‌
నవతెలంగాణ-యాలాల
తాండూర్‌ ప్రాంత జనాలు తాండూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బి. మనోహర్‌ రెడ్డికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలని యాలాల మండల బీఆర్‌ఎస్‌శాఖ అధ్యక్షులు సి.రవీందర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ వడ్డె రాములు, మాజీ జడ్పీటీసీ సభ్యులు సిద్రాల శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ మండల యూత్‌ విభాగం అధ్యక్షులు కె. ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి విలేకరుల సమా వేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. రూ. కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుంటే మనోహర్‌ రెడ్డికి ఓట్లు పడే అవకాశం కరువైందన్నారు. ఇటీవల యాలాల సొసైటీ చైర్మన్‌ జి.సురేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉండి పదవులు అనుభవిస్తూ గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం నమ్మకద్రోహమేనని అన్నారు. కార్యకర్తలు, సీని యర్‌ నాయకులు, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి సురేం దర్‌ రెడ్డి గెలుపులో భాగమై ఎన్ని అడ్డంకులు ఎదురైనా యాలాల సొసైటీకి చైర్మన్‌ను చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు కలిసి సురేందర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి నచ్చ చెప్పిన కొద్దిసేపటికి కాంగ్రెస్‌లో చేరడం క్షమించరాని విషయమన్నారు. యాలాల సొసైటీ చైర్మన్‌గా సురేందర్‌ రెడ్డి సరైన వ్యక్తి కాదని ముందుగానే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పి. సునీతారెడ్డి చెప్పినట్టు వారు గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్‌ రెడ్డి ఫ్రస్టేషన్లో ఉండి ఏదేదో మాట్లాడుతు న్నాడని పద్ధతి మార్చుకోవాలని వారు ఆయనకు హెచ్చరించారు. మునిపెన్నడూ లేని విధంగా తాండూర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ నీచ రాజకీయాలకు తెర లేపిం దని మండిపడ్డారు. తాయిలాల ఆశలు చూపి మనోహర్‌ రెడ్డి నైతిక విలువలు లేని రాజకీయాలకు ఉసిగొలు పుతున్నారని ఆరో పించారు. విలేకరుల సమా వేశంలో జిల్లా కో ఆప్షన్‌ సభ్యు ల సం ఘం అధ్యక్షు లు అక్బర్‌బాబా, వివిధ గ్రామాల నాయకులున్నారు.