– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ- రామారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుండి స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో, ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం స్వచ్ఛందంగా 6 గ్యారంటీలను అమలు చేయనున్నదని శుక్రవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపేట్, రామారెడ్డి లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజా సమస్యలపై కేంద్రాల వద్ద ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకున్న ప్రతి సమస్యపై కేంద్రాల వద్ద అధికారులకు వినతి పత్రం అందించవచ్చని సూచించారు. స్థానిక ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్లూరి రగోతం రెడ్డి, కిషన్ యాదవ్, రాజయ్య, కుమ్మరి శంకర్,బీజేపీ నాయకులు గోపు గంగారాం, పంచాయతీ కార్యదర్శులు అరవింద్ రెడ్డి, నరేష్, రవి, రాములు, అంగన్వాడి టీచర్లు పద్మజ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.