నవతెలంగాణ – తొగుట
కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయాలు చేసే నాయకులకు ప్రజలు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని సొసైటీ చెర్మన్ కన్నయ్య గారి హరి కృష్ణ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వరద రాజు పల్లి గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాం డ్ చేశారు. హామీల అమలు తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీగా గెలిచిన నెల రోజులలో తన సొంతంగా రూ. 100 కోట్ల నిధులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ తరగ తులు నిర్వహిస్తారని తెలిపారు. కులాల, మతాల పేరుతో రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని సూచిం చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభు త్వం కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి దేశ సంపదనంతా వారికే దోచిపెడుతుందని విమర్శిం చారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిల బెట్టుకోలేదని ఎద్దేవాచేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రద్దు చేసి అభివృద్ధి ని అడ్డుకున్నారని మండిపడ్డారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వడ్లకు రూ. 500 బోనస్ రైతులకు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రచా రంలో భాగంగా ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలం తా బిఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని హామీ ఇస్తు న్నట్లు తెలిపారు. మే 13 వ తేదీన జరిగే ఎన్నికల లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల ని కోరారు. అంతకుముందు గ్రామంలోని హను మాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఛత్రి శ్రీనివాస్, మాజీ సర్పం చ్ కోతి కనకయ్య, బూత్ కన్వినర్ ఎర్వ జనార్దన్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు పులి భైరయ్య, దేవయ్య, తిరుపతి రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.