అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వెళ్ళరాదు

People should not go out of their homes except in emergencies– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వెళ్ళరాదని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ఆదివారంలో ప్రకటనలో మండల ప్రజలకు కమ్మర్ పల్లి పోలీస్ తరపున విజ్ఞప్తి చేశారు.మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసిందని వివరించారు.
నిజామాబాద్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ జాబితాలో ఉన్నందున  జిల్లాలోని దాదాపుగా అన్ని మండలాలలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వెళ్ళరాదు. రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రయాణాలను రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు.శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలు, వారి వివరాలు సంబంధిత గ్రామ, మండల స్థాయి అధికారులకు తెలియజేయాలన్నారు.  రైతులు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళకూడదుని, చిన్నపిల్లలను అస్సలు ఇంటి నుండి బయటకు రానివ్వద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితిలో తాకరాదని, మురికి కాలువలు, నాళాలు, మ్యాన్ హోల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్త వహించాలని,  అత్యవసర పరిస్థితి వస్తే తప్ప బయటకు రాకూడదని విన్నవించారు.ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే  వెంటనే కమ్మర్ పల్లి ఎస్ఐ ఫోన్ నంబర్ 87126 59868, లేదా డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలని ఎస్ఐ అనిల్ రెడ్డి మండల ప్రజలను కోరారు.