నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శుక్రవారం నాంపల్లి మౌలానా ఆజాద్ మెమోరియల్ ప్రభుత్వ మోడల్ జూనియర్ బాలికల కళాశాల ఆవరణలో గోషామహల్ జిహెచ్ఎంసి సర్కిల్ -14 డిప్యూటీ కమిషనర్ విద్యాధర్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కళాశాలలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. కళాశాల మౌలిక వసతుల ఫై కళాశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన మొక్కలు నాటారు. దోమల నివారణ పై రూపొందించిన కరపత్రాన్ని, కుక్క కాటును ఇలా నిర్వహించవచ్చు కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో పారిశుధ్య నిర్వా హణ, నాలాల పూడికతీత, అన్ని ప్రాంతాలలో పరిసరాల శుభ్రత, దోమల నివారణ చర్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పచ్చదనాన్ని పెంపొందిం చేందుకు అన్ని ప్రాంతాలలో మొక్కల పంపిణీ చేసి బస్తీలు, కాలనీలో పాఠశాలలలో అవగాహ న కార్యక్ర మాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. సర్కిల్ -14 డిప్యూటీ కమిషనర్ విద్యాధర్ మాట్లాడుతూ.. గత ఐదు రోజులుగా సర్కిల్ పరిధిలో మొదటి రోజు వ్యర్ధాల తొలగింపు, రెండవ రోజు దోమల నిర్మూలన, మూడవరోజు చెరువుల సంరక్షణ, నాలుగవ రోజు నాలాల క్లీనింగ్, ఐదవరోజు వన మహోత్సవం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి, ఎ ఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, వెటర్నటీ డాక్టర్ నస్రిన్ అంజుమ్, కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, యు సి డి సి ఓ సమ్మయ్య, లెక్చరర్స్ టీజీ శ్రీనివాస్, కె సుమన, ఫిజికల్ డైరెక్టర్ స్నేహలత, లైబ్రేరియన్ సమత, హతి పర్వీన్, సుభాష్, అరుంధతి, భార్గవి, శిరీష ,అంబికా, జైవీర్ ఉన్నిసా, నజియా ,అస్మా ,శ్రీలత,జిహెచ్ఎంసి ఎంటా మాలజిస్ట్, ఆర్ పి లు జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.