
ఆళ్ళపల్లి మండల ప్రజలు 108 వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, వైద్యాధికారి అర్వపల్లి రేవంత్ సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక సాంకేతిక పరికరాలతో వచ్చిన నూతన 108 వాహనాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన 108 వాహన సేవలు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి రేయింబవళ్ళు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే 108 వాహన సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో నిత్యం వాహనం కండిషన్, వాహనం సంబంధించిన సెల్ చార్జింగ్, ఫోన్ నెంబర్ నెట్వర్క్ లో ఉండేలా చూసుకోవాలి సూచిస్తూనే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ డైరెక్టర్ ఈసం సాంబశివరావు, వైద్య సిబ్బంది సమ్మక్క, నరేష్, యాఖుబ్బీ, 108 వాహనం పైలట్లు పరమ సునీల్, బబ్లు, తదితరులు పాల్గొన్నారు.