
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కార్యక్రమంలో ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం కిసాన్, ఉజ్వల యోజన, ముద్ర లోన్, ఆయుష్మన్ భారత్ లాంటి పథకాలను కేంద్రంలోని ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం అమలు పరుస్తుంది అన్నారు. అర్హులైన లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ మాట్లాడుతూ కేంద్రం నుండి అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే అట్టి శాఖకు సంబంధించి వివరాలను గ్రామ కార్యదర్శి నీ సంప్రదించి అర్హులైన వారందరూ ధరకాస్తు చేసుకొని, లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కు కావాలని సూచించారు. అనంతరం ఎంపీ అరవింద్ పీఎం కిసాన్, ఉజ్వల యోజన, ముద్ర లోన్, ఆయుష్మన్ భారత్ పథకాల లబ్ధిదారులతో ఎంపీ ముచ్చటించారు. మోడీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపిడిఓ సంతోష్ రెడ్డి, జాతీయ సమాచార అధికారి, మండల ప్రత్యేక అధికారి యోహాన్ , భీంగల్ ఏడిఏ మల్లయ్య, ఐకెపి ఎపిఎం కుంట గంగారెడ్డి, పంచాయితీ కార్యదర్శి నర్సయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు,వివిధ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.