ప్రభుత్వ పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి

– మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ గౌడ్
నవతెలంగాణ అచ్చంపేట: నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీనా పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట మండలం పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ గౌడ్ అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ రెండు రోజుల్లో భాగంగా మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దరఖాస్తులు ఏ విధంగా ఫిలప్ చేయాలి,, పేదల అనుమానాలకు నివృత్తి చేశారు. ఐదు పథకాలకు ఒకే దరఖాస్తులు రూపొందించడం జరిగిందని దీనిని గ్రామీణ ప్రాంత పేద ప్రజలు అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి బీముడు, మాజీ సింగల్ విండో చైర్మన్ మనోహర్ , మాజీ ఎంపీటీసీ హుస్సేను, రాఘవులు తదితరులు ఉన్నారు.