ప్రధానమంత్రి సురక్ష బీమాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

People should take advantage of Prime Minister's Insurance– ఏపీజీవీబీ మేనేజర్ జలందర్
నవతెలంగాణ – తోగుట
సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ప్రజలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీజీవీబీ మేనేజర్ జలందర్ అన్నారు. భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదే శాల మేరకు బుధవారం మండలంలోని చందాపూ ర్ గ్రామంలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం భాగంగా ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ సెక్యూ రిటీ స్కీమ్స్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. సంవ త్సరానికి రూ. 20 చెల్లించి ఏడాదికి రెండు లక్షల ప్రమాద బీమా పొందడానికి అవకాశం వుందన్నా రు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు అర్హులు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన 436 సంవత్సరానికి రూ. 436 చెల్లించి రెండు లక్షల జీవిత బీమా పొందవచ్చని తెలిపారు. 18 నుండి 50 సంవత్సరాల వారు అర్హులు ఫిషింగ్ కాల్స్ ద్వారా సేవింగ్ కాల్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ పై అవగాహన కల్పించారు. బ్యాంకు నుంచి ఎలాంటి ఓటీపీలు సివివి నెంబర్లు అడిగే అవకాశం ఉండదని సూచించారు. ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే 1930 కి కాల్ చేసి తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీ సర్ భరత్ కుమార్, మాజీ సర్పంచ్ బొడ్డు నర సింహులు, బ్యాంకు మిత్ర కుమార్, ఆర్థిక అక్షరా స్యత కేంద్రం కౌన్సిలర్ ఎనుముల శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.