తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు బుధవారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో పట్టణంలోని అర్హులైన వారందరికీ పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరించేందుకు పట్టణంలోని ప్రతి వార్డులో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజా పాలన యొక్క దరఖాస్తు ఫారములు కౌంటర్ వద్ద ఉదయం ఎనిమిది గంటల నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నము రెండు గంటల నుండి 6 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి ఐలేని అనిత గారు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్