
నవతెలంగాణ – పెద్దవంగర
జన వికాస స్వచ్ఛంద సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుంపల శ్యామ్, వేముల వెంకన్న అన్నారు. మంగళవారం ఉప్పరగూడెం గ్రామంలో జన వికాస ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహ హాస్పిటల్ హనుమకొండ వారి సహకారంతో ప్రజలకు వైద్య పరీక్ష నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన వికాస కోఆర్డినేటర్ రమ తో కలిసి వారు మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జన వికాస సంస్థ అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుభాష్, పాషా, కృష్ణవేణి, ప్రసన్న, రాజేష్, బాల వికాస కోఆర్డినేటర్ మద్దెల రమ, సరిత, మేనక తదితరులు పాల్గొన్నారు.