గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జన వికాస అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దవంగర సెంటర్ మేనేజర్ వై. రమ, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జన వికాస ఆధ్వర్యంలో, మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ తొర్రూరు సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వైద్యాధికారి నరేష్ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ.. వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని.. తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని, ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మెడికేర్ సిబ్బంది కిరణ్, రాధాకృష్ణ, సందీప్, కోఆర్డినేటర్ లు జె. శైలజ, శోభారాణి, కారోబార్ కుమారస్వామి, చిలుక సిద్దు తదితరులు పాల్గొన్నారు.