ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

– ఫతేనగర్‌ కార్పొరేటర్‌ పండాల సతీష్‌ గౌడ్‌
నవతెలంగాణ – బాలానగర్‌
మూసాపేట సర్కిల్‌ ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక కార్పొరేటర్‌ పండాల సతీష్‌ గౌడ్‌ అన్నారు. కూకట్‌ పల్లి నియోజకవర్గం ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలోని శివశంకర్‌ నగర్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్‌ పండాల సతీష్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు కషి చేస్తున్నా మన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మల్లారెడ్డి హాస్పిటల్‌ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం డివిజన్‌ పరిధిలో ఏర్పాటు చేయనున్నట్టు కార్పొరేటర్‌ తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని కార్పొరేటర్‌ స్థానిక ప్రజలకు సూచించారు. ఉచిత వైద్య శిబిరంలో షుగర్‌, బీపీ, పంటి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్‌ ప్రతినిధి డా. రవికుమార్‌, స్థానికులు బస్వరాజు, శ్రీను, విజయ్, అశోక్‌, బాబీ, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.