వడ్డీ మాఫీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

– వార్డులలో హెల్ప్ డే స్కూల్ లు  ఏర్పాటు చేయాలి
– కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం  మున్సిపాలిటీ లలో  2023 వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను వడ్డీ లో 90 శాతం మాఫీ  ని ప్రజలు  సద్వినియోగం చేసుకునేలా తెలియజేయలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.శుక్రవారం అమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వివిధ అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ లలో  ఆస్తి పన్ను వడ్డీ పై 90 శాతం  మాఫీ ప్రకటించిన విషయాన్ని ఆటో ప్రచారం ద్వారా  విస్తృతంగా తెలియజేయాలని, మార్చి 31 లోగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఈ మాఫీ వర్తిస్తుందన్న విషయాన్ని అన్ని అవార్డులలో అందరికీ తెలియజేసి ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని  చెప్పారు. మున్సిపాలిటీలలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, కొత్త బోర్లు వేయవద్దని, నీటిని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. ప్రజాపాలనకు సంబంధించి  వార్డులలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్  పి.వీరేందర్,  భాస్కర్ రెడ్డి, బాలయ్య,  మునావర్ అలీ,  బి. శ్రీనివాస్, కరణ్, యూసఫ్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.