మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కార్యక్రమం నిర్వహించారు. రైతులు వీడియో కాన్ఫరెన్స్ రుణమాఫీ కార్యక్రమని వీక్షితు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదిక వద్ద రైతులతో టెలికాన్ఫరేన్ష మండల ప్రత్యేక అధికారి కిసాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడంరై తులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి ఏకకాలంలోరైతులకు రుణమాఫీ చేయడం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతు ప్రభుత్వం గా నిరూపించుకున్నదని అన్నారు. అనంతరం రైతు వేదిక ప్రాంగణంలోటపాసులు కాల్చి సంబరాలు చేసి నినాదాలు చేస్తూ సంతోష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కిసాన్ ,తహశీల్దార్ దశరథ్,ఇన్చార్జ్ ఎంపీడీఓ సూర్యకాంత్,మండల వ్యవసాయ శాఖ అధికారి నదీమ్ ఉద్దేన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్,జాఫర్,శ్రీనివాస్, రషీద్,ఫెరోజ్ మండలంలోని రైతులు పాల్గొన్నారు.