ఎన్నికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించే వారిని ఆదరించి ఎన్నుకోవాలి 

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

నవతెలంగాణ- నవీపేట్:
ఎన్నికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించే వారిని ఆదరించి ఎన్నుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం నవీపేట్ కేంద్రంలో జరిగినటువంటి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించే వారిని ప్రధానంగా నిరుద్యోగులు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఉపాధి కల్పించే వారిని ఇంకా కార్మికుల సమస్యలను పరిష్కరించే వారిని రైతులకు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అమలు జరిపే వారిని గెలిపించడానికి సహకరించాలని ఆయన అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే మతోన్మాద భావజాలాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందినయని నిజంగా నిత్యవసర సరుకుల ధరలను పెరగటంతో పాటు, ప్రజా సమస్యలను విస్మరించాయని ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు గణేష్, సందీప్, పవన్, కార్తీక్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.