– శ్రావణమాసం చివరి సోమవారంలో ముగిసిన జాతర
నవతెలంగాణ-పెద్దేముల్
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా మండల పరిధిలోని తట్టేపల్లి అంబు రామేశ్వర జాతరకు భక్తు లు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నెలరోజుల పాటు దీక్షలు సాగిస్తూ స్వామి వారి దర్శనం అనంతరం దీక్షలను విరమింపజేశారు. స్వామివారికి అభిషేకం నిర్వ హించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతియటా శ్రావణమాసం చివరి సోమవారం నిర్వహించే అంబు రామేశ్వర జాతరకు తెలంగాణలోని ఎందుకురా పలు జిల్లాలతో పాటు కర్ణాటక ప్రాంత ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నా రు. అంబు రామేశ్వర జాతరను పురస్కరించుకొని ఆలయ సన్నిధానంలో పెద్దేముల్ భజన మండలి భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఎలాం టి ఆవంచనీయ సంఘటనలూ జరగకుండా గట్టి పోలీస్ బంద్ వస్తుంది ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ కాశీనాథ్ వెల్లడిం చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటయ్య, సొసైటీ వైస్ చైర్మన్ అంజయ్య, ఎంపీటీసీలు శంకర్ నాయక్, ధన్ సింగ్, సర్పంచులు జనార్దన్ రెడ్డి, భరత్, శంకర్ నాయక్, ట్యోప నాయక్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్, మాజీ సర్పంచులు గ్యేయనాయక్, నారాయణ గౌడ్, నాయకులు జయరాం నాయక్, జ్ఞానేశ్వర్, రాజ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.