నవతెలంగాణ – మల్హర్ రావు
రైతుల సంక్షేమమే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతూ రైతులకు పంట రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో కాంగ్రెస్ నాయకులు, రైతుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రస్తుత ఐటీ,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ,ప్రస్తుత రాష్ట్ర సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు.మాటకు కట్టుబడి ప్రభుత్వం లక్ష వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు రైతుల పక్షాన సీఎం రేవంత్,మంత్రి దుద్దిళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, డివిజన్ కార్యదర్శి మండల రాహుల్, నాయకులు కేశారపు చెంద్రయ్య, జంగిడి సమ్మయ్య, కన్నూరి రవి,కిషన్ నాయక్,జక్కు వెంకటస్వామి,బండి స్వామి,కుంట భూమయ్య, బూడిద చెంద్రయ్య,ఇందారపు ప్రభాకర్,మేనం శ్రీనివాస్,ఆర్ని రాజబాబు,తుంగపల్లి సాత్విక్,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల ఇంఛార్జి దొగ్గేల సంపత్ పాల్గొన్నారు.