అతి భారీ వర్షంతో మండల ప్రజానీకం అతలాకుతలం అయ్యారు. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మండలంలోని వాగులు, ఓర్రెలు వర్షపు నీటితో పొంగి ప్రవహించాయి. తాడువాయి పసర 163వ జాతీయ రహదారి పై భారీ వృక్షాలు కూలడంతో ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. జలగలంచ వాగు ప్రమాద ఉధృతిని దాటి ప్రవహించింది. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని అంచనా వేస్తూ తగు జాగ్రత్తలు చేపడుతున్నారు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అప్రమ్తమై వరద ప్రవాహాన్ని అంచన వేస్తూ ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తంతో ఉన్నారు. జలగలంచ వాగు పొంగుతున్న నేపథ్యంలో అటు వెళ్లవలసిన వాహనాలను పోలీసులు పసర గ్రామంలో నిలిపివేశారు.