కర్ణాటక ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌లోకి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఎంట్రీ

కర్ణాటక ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌లోకి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఎంట్రీ100 చిత్రాల నిర్మాణ లక్ష్యంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ అనతికాలంలోనే ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
కచ్చితత్వానికి, మంచి క్వాలిటీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్‌ తన విజన్‌తో నిర్మిస్తున్న చిత్రాలు, ముందుకు వెళ్తున్న తీరుతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. అంతేకాదు భారీ బడ్జెట్‌ చిత్రాలకు నిర్మాణానికి ప్రతీకగా ఈ బ్యానర్‌ నిలిచింది. ఓవర్సీస్‌లో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సత్తా చాటిన పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఇకపై శాండిల్‌వుడ్‌లో కూడా తన ప్రత్యేకతను చాటేందుకు సిద్దమైంది.
కన్నడ
డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి టీజీ విశ్వ ప్రసాద్‌ అడుగు పెట్టబోతున్నారు. కేఆర్‌జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ఇకపై అక్కడ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌ నుంచి ‘శ్వాగ్‌’, ‘విశ్వం’, ‘మోగ్లీ’, ‘తెలుసు కదా..’ వంటి తదితర చిత్రాలు అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సినిమా నిర్మాణంతోపాటు పంపిణీ రంగంలోనూ తమ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్నాం అని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ తెలిపారు.