ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి: దాసరి పాండు

నవతెలంగాణ – బొమ్మలరామారం
మండలంలో గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలు  పరిష్కారం చేయకపోతే తహసీలల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ సమావేశం బ్రహ్మచారి అధ్యక్షన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు మాత్రం గ్రామాలలో ఇక్కడ వేసిన గొంగడి లాగే ఉన్నాయని మండిపడ్డారు. సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యల పైన పరిశీలన చేయడంతో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే ప్రభుత్వం అధికారులు సమస్యలు పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల తాసిల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, బ్రహ్మచారి, లక్ష్మయ్య, నరేష ,పున్నమ్మ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.