వేములవాడ అర్బన్ మండలం ప్రజా ప్రతినిధులు శనివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలెక్టరేట్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ తో ముంపు గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముంపు గ్రామాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పిటిసి మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ ఆర్ సి రావు, బి ఆర్ ఎస్ నాయకులు కొండపల్లి వెంకటరమణ రావు, మైలారం రాము ఉన్నారు.