ప్రజల చెంతన పాలన

నవతెలంగాణ – నిజాంసాగర్

నిజం సాగర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. అందులో భాగంగా ప్రజల దగ్గరకు వెళ్లి పాలన చేయడంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే వారి పనులను పరిష్కరించడంలో తహశీల్దార్ మరియు వారి సిబ్బంది తమ వంతు పాత్ర నెరవేర్చడంలో ముందంజలో ఉన్నారు.ఈ సందర్భంగా తహసిల్దార్ బిక్షపతి మాట్లాడుతూ.. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల దగ్గరికే పాలనలో భాగంగా మా యొక్క సిబ్బంది కళ్యాణ లక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్లి కళ్యాణ లక్ష్మి పథకం కు సంబంధించిన పేపర్లు తీసుకోవడం, వారి ఇంటి దగ్గరే సంతకాలు సేకరించడం, అన్ని కూడా సరైన విధంగా ఉన్నాయా లేదా అని ఇరుగుపొరుగు వారికి అడిగి తెలుసుకోవడం జరిగింది అని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి మా సిబ్బంది వస్తారని ఆయన అన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులందరికీ పథకం అందేలా చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిహెచ్ అంజయ్య కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ది హాన్మండ్లు, బుడమే శ్రీనివాస్, కొడగంటి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాలేదు కానీ ఈ ప్రభుత్వంలో మా ఇంటి దగ్గరికి అధికారులు వచ్చి పేపర్లు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది : నారాయణ, లబ్ధిదారుడు.
గత ప్రభుత్వంలో ఆఫీసుల చుట్టూ తిరగడం జరిగింది ఏదైనా పేపర్ తక్కువ అయితే మళ్ళీ తీసుకురా రేపు తీసుకురా అని తిప్పే వాళ్ళు కానీ ఇప్పుడు అధికారులే మా దగ్గరకు వచ్చి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏలాంటి పేపర్ కావాలో మొత్తం సమాచారం ఇచ్చి అన్ని పేపర్లు తీసుకొని వెళ్లడం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎన్ని సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా పని జరగలేదు. గతంలో సాక్షులను తీసుకొని మండల కేంద్రానికి వెళ్లి పొద్దున నుండి సాయంకాలం వరకు నిల్చుండే వాళ్ళం. అయినా రెండు రోజులు సమయం పట్టేది కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా అధికారులు మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది.- గొల్ల ఈరయ్య, లబ్ధిదారుడు.