నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేల ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నంబర్ 9 నుంచి డిసెంబర్ 7 వరకు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ నుంచి తెలంగాణ సంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాలను అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి జెండా ఉపి ప్రారంభించారు. కళాకారులు ప్రభుత్వ పథకాలను వివరిస్తు పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 15 మంది కళాకారులు రెండు టీంలుగా విడిపోయి గ్రామ పంచాయతీలు, వార్డులు, మున్సిపాటిల్లో ప్రభుత్వ పథకాలపై పాటల ద్వారా అవగాహన కల్పిస్తారన్నారు. అదే విధంగా ఈనెల 22న జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయి నుంచి కల్చరల్ బృందం వచ్చి తమ ప్రదర్శన ఇవ్వనుందని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు వాటిని సక్రమంగా వినియోగించేలా ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు. డీపీఆర్ఓ తిరుమల, టూరిజం అధికారి పార్థసాథి, రవీందర్, అశోక్, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.