– చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి సతీమణి జ్యోతి భీంభరత్
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ప్రజల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతోందని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి సతీమణి జ్యోతి భీమ్ భరత్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం శంకర్‌పల్లి మండలంలోని పరివేద, కొత్తగూడ, కచ్చిరెడ్డి గూడ, లచ్చిరెడ్డిగూడ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేండ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ కాఫీ పేస్ట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌కు అవకాశం కల్పించాలని నియోజకవర్గంలోని ప్రజలందరిని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఉదరు మోహన్ రెడ్డి, శంకర్‌పల్లి మండల, మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు జనార్థన్ రెడ్డి, వై. ప్రకాష్ గుప్తా, ఏనుగు రవీందర్ రెడ్డి, యాదయ్యగౌడ్, కాంగ్రెస్ పరివేద నాయకులు ఏ. శుభాన్ రెడ్డి, ఏవిఆర్ విష్ణు, ఎండీ. నసీరుద్దీన్, భూపాల్, మహిపాల్ రెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భూపాల్, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.