– కామారం(టి), దామెరవాయి గ్రామాలలో ఘనంగా పోషణ పక్ష కార్యక్రమాలు
నవతెలంగాణ- తాడ్వాయి
చిన్నపిల్లలకు బాలింతలకు గర్భిణీలకు సంపూర్ణ ఆరోగ్యమే సమగ్ర మాత శిశు అభివృద్ధి సంస్థ, లక్ష్యమని, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ అన్నారు. మంగళవారం మండలంలోని కామారం(టి), దామెరవాయి గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పరీక్ష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ విజయ, అంగన్వాడి టీచర్ లు మాట్లాడుతూ.. గర్భిణీలు బాలింతలు చిన్నారుల్లో ఫస్ట్కారం లోపం అధికమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమే లక్ష్యంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పక్వాడ( పోషణ పక్షం) కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదనపు ఆహార విశిష్టత, తల్లిపాల ఆవశ్యకత, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీ ప్రదేశాల్లో పెరటి తోటల పెంపకం పెంచే మొక్కలను సంరక్షించి పర్యవేక్షించాలన్నారు. చిన్నారులు కిశోర బాలికలు బాలింతలను పోషకాహార లోపం నుంచి విముక్తి చేయడం ఆరోగ్యవంతులను చేయడానికి పోషణ పక్వాడ దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వర్కర్ బి జ్యోతి, దామరవాయి అంగన్వాడి టీచర్లు సావిత్రి, అమృత, కామారం అంగన్వాడి టీచర్లు నాగమణి, జానకి, గ్రామస్తులు, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.