నవతెలంగాణ – భైంసా
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. బైంసా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలుతున్న తరుణంలో ఆరోగ్య విషయంలో అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. వర్షాకాలం సందర్భంగా రైతులు ఇబ్బందులు ఇబ్బందులు పడకుండా పానాజీ రోడ్లపై దృష్టి సారించాల్సిందిగా పంచాయతీ రాజ్, ఉపాధిహామీ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, తనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం శ్రద్ద చూపాలన్నారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు దృష్టి సారించి, చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందించేలా చూడాలన్నారు. సమావేశంలో బైంసా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి సుభాష్, పశు వైద్యాధికారి విఠ ల్, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులుపాల్గొన్నారు.