పంచాయతీ కార్యదర్శుల పనితీరు పరిశీలన

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలో 4 సంవత్సరాలు గ్రామపంచాయతీలో విధులు పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరును జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి, డీఎస్పీ ప్రకాష్, ఎఫ్.డి.ఓ గోపాల్ రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, కాచాపూర్, అయ్యవారిపల్లి, ఇసన్నపల్లి, భాగిర్థిపల్లి, సిద్ధ రామేశ్వర నగర్, గుర్జకుంట, ర్యాగట్లపల్లి, తిప్పాపూర్, మోటాట్ పల్లి గ్రామాలలో పర్యటించి పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, మురికి కాలువలు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక ఇతర పల్లె ప్రగతి పనులను పరిశీలించి పనుల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులకు మార్కులు వేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అంతకుముందు మొదటిసారిగా గ్రామాలకు వచ్చిన అడిషనల్ కలెక్టర్, డీఎస్పీ, ఎఫ్ డి ఓ లను అయా గ్రామ సర్పంచులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు మధు మోహన్ రెడ్డి, సులోచన సుదర్శన్, సుమలత, రాములు, లక్ష్మి, నాగలక్ష్మి స్వామి, శ్రీనివాస్, మనోహరా రమేష్, అనసూయ, స్వామి, రాజేశ్వరి రాజారెడ్డి, ఆయా గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.