కాలం

Timeబాల్యం, యవ్వనం, వృద్దాప్యం ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి. బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధానం. దీన్ని ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరం అలసి పోతుంది. దాంతో సమయానికి తింటారు. తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది. అలాగే ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యానికి, చదివే చదువులు వృత్తికి సాయపడతాయి. ఎంత శ్రద్దపెట్టి చదివితే అంత గుర్తింపు.

వ్యక్తి జీవితంలో కాలం కన్నా విలువైనది ఉండదు. ఒక వ్యక్తి సమయ పాలన పాటించడాన్ని బట్టే అతని జీవితం ఆధారపడి ఉంటుంది. చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలిగితే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. లేదంటే ఆ పనికి ఏ మాత్రం విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా అవసరానికి ఉపయోగపడకపోతే ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే కదా! అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి లేదా వ్యవస్థ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందిస్తూ ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తుంటారు. అయితే ఆ సేవలు సమయానికి ఉపయోగపడితే సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. అలా సదభిప్రాయం ఏర్పడితే ఆ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించిందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం గడువులోపులో పనిని పూర్తి చేయగలిగితే అవసరాలకు అంతరాయం కలగదు.
బాల్యం, యవ్వనం, వృద్దాప్యం ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి. బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధానం. దీన్ని ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరం అలసి పోతుంది. దాంతో సమయానికి తింటారు. తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది. అలాగే ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యానికి, చదివే చదువులు వృత్తికి సాయపడతాయి. ఎంత శ్రద్దపెట్టి చదివితే అంత గుర్తింపు.
కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్ట ఫలితం మరొక కాలంలో కనబడుతుంది. అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి. అందుకు శ్రమించాలి అంటారు పెద్దలు. కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయి. అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది.
ఒక వ్యక్తి వ్యాయామంతో దృఢంగా తయారయితే, ఆ దృఢత్వం అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే తర్వాత కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే తర్వాత కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు. ఈ విధంగా కాలం వ్యక్తి జీవితంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. అందుకే కాలాన్ని బంగారంతో పోల్చారు. అందుకే కాలం చాలా విలువైనది. ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు. ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది అనేది మాత్రం సత్యం. అందుకే అనవసరమైన పనులతో కాలాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే కరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురావడం జరిగే పని కాదు.