టాలీవుడ్ సక్సెస్ఫుల్ హర్రర్ థ్రిల్లర్ ‘పొలిమేర 3’ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వంశీ నందిపాటి దీన్ని నిర్మించనున్నారు. ఈ సిఇనమా అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇందులో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ‘మా ఊరి పొలిమేర’కి వచ్చిన రెస్పాన్స్‌తో సీక్వెల్‌గా ‘పొలిమేర2’ రూపొందించారు. ఈ సినిమా సైతం విశేష ఆదరణ పొందడంతో మేకర్స్ ‘పొలిమేర 3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నిర్మాత ఐ.భరత్