అనుమతులు తప్పనిసరి

Permissions are mandatoryనవతెలంగాణ-మహదేవపూర్‌
వినాయక చవితి సందర్భంగా గణేషుడి విగ్ర హాలు పెట్టుకునేవారు పోలిస్‌, విద్యుత్‌శాఖ అనుమతి తీసుకోవాలని సీఐ కిరణ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీ నిర్వాహకులు పోర్టల్‌లో విగ్రహం పెట్టు స్థలం, విగ్రహం ఎత్తు, సభ్యుల పేర్లు, ఫోన్‌ నెంబర్‌లు, నిమజ్జనం తేది తదితర వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా విధిగా పోలీసుల సూచనలు పాటించాలని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సీఐ కోరారు.