– అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్
ధరూరు : జిల్లా పరిశ్రమలకు అనుమతులు సకాలంలో ఇవ్వాలని అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాల్‌లో టీ ఎస్ ఐ పాస్ , డీ ఐ పీసీ పై పరిశ్రమల శాఖ, ఆర్ డీ ఓ, ఎస్సీ కార్పోరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టి ప్రైడ్ పథకం కింద 13 మంది ఎస్సి , ఎస్ట్టీి లబ్ధిరులకు సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని, ఈ పథకం కింద పురుషులకు 35 శాతం, స్తీల కు 45 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగు తుందని తెలిపారు. లాభ దాయక మైన పరిశ్రమలను గుర్తించాలని అధికా రులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ డీి ఓ రాములు , జిల్లా పరిశ్రమల అధికారి యాదగిరి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్ బాబు, ఎల్ డీ ఎం అయ్యపు రెడ్డి, ఆర్ టీి ఓ పురషోతం రెడ్డి, డిక్కీ కో ఆర్డినేటర్ సోమశేఖర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.