
ఇటీవల ఐకెపి ద్వారా కొనుగోలు చేసిన ఆర్వెస్టర్ తో నష్టాలే తప్ప లాభాలు రావడం లేదని ఐకెపి సిబ్బంది పేర్కొనడంతో, ఎంపీపీ లోపు రజిని కిషోర్, జడ్పిటిసి మేక విజయ సంతోష్, ఎంపీడీవో శంకర్ లు సూచించారు. శుక్రవారం 17వ మహాజనసభ నిర్వహించారు. గత సంవత్సరం హార్వెస్టర్ ద్వారా చెల్లించాల్సిన డబ్బులు రైతుల నుంచి రాబట్టుకోలేకపోవడంతో, దానిని లీజుకు ఇవ్వాలని వారు స్పష్టం చేశారు. వార్షిక నివేదిక చదివే ముందు, ఈ సంవత్సరంలో మహిళా సంఘాల సభ్యులు కానీ, సిబ్బంది కానీ మృతిచెందినట్లయితే వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. నేడు నూతన పాలకవర్గం ఎంపిక చేయగా, గతంలో పనిచేసిన మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మిని తిరిగి ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మాధవి, కోశాధికారిగా స్వరూపం నూతనంగా ఎన్నుకున్నట్లు ఇన్చార్జి ఏపిఎం భాస్కర్ తెలిపారు. మండల కేంద్రంలోని వనిత గ్రూప్ లో అవ్వక తవకలు జరిగినట్లు సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ సభ దృష్టికి తీసుకురాగా, ఈనెల 25న ఐటీపీ సిబ్బంది మొత్తం ఆ గ్రూపులకు సంబంధించిన రికార్డులను విచారించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, ఇన్చార్జి ఎపిఎం భాస్కర్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఐకెపిసిసిలు శివకుమార్, కృష్ణ, రాజయ్య, సునీత, శ్రీనిధి అధికారిని షాలిని, మండలంలోని గ్రామ అధ్యక్షులు ,ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.