– అధికారుల వద్ద పలువురి ఇసుక రవాణదారుల పైరవీలు
నవతెలంగాణ – బెజ్జంకి
ఇసుక రవాణ చేయడానికి అనుమతులు కావాలా? అయితే రూ.5 వేలిస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు జారీ చేయిస్తానంటూ మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక అక్రమ రవాణదారులు పైరవీలు సాగిస్తున్నట్టు వినికిడి. నెలనెల చెల్లించే వాహనాల ఈఎంఐల కోసం ఇసుక అక్రమ రవాణదారులు అధికారుల అనుమతుల పేరుతో పలువురి వాహనాదారుల వద్ద అడ్డదారులతో రూ.5 వేలు దండుకుంటున్నారని గ్రామంలోని పలువురు ఇసుక రవాణదారులు ఆరోపిస్తున్నారు. దళిత సామాజిక వర్గాల వాహనాలపై కుల వివక్ష చూపుతూ పలువురు వాహనాదారులు అందికాడికి ఇసుక దోపిడికి పాల్పడుతూ అక్రమంగా దండుకుంటున్నారని,పైరవీలకు పాల్పడుతున్న ఇసుక అక్రమ రవాణదారులను అరికట్టాలని గ్రామంలోని పలువురు రవాణదారులు సంబంధిత అధికారులను కోరారు.పలువురి ఆరోపనలపై తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్ ను వివరణ కోరగా అధికారుల అనుమతుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ప్రశ్నించే తత్వం నెర్చుకోవాలని,ఇసుక రవాణ అనుమతులకు వాహనాదారులు నేరుగా దరఖాస్తులు సమర్పిస్తే పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా అనుమతులు మంజూరీ చేస్తామని తెలిపారు.