తెలుగులో ‘పట్టుదల’గా..

హీరో అజిత్‌కుమార్‌, లైకా ప్రొడక్షన్స్‌ కలయికలో మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విడాముయర్చి’. ‘పట్టుదల’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, సాంగ్స్‌, ప్రమోషనల్‌ కంటెంట్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్‌ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో మేకర్స్‌ ‘పట్టుదల’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అజిత్‌ స్టైలిష్‌గా సాల్ట్‌ అండ్‌ పేపర్‌ లుక్‌తో నెవర్‌ బిఫోర్‌ అవతార్‌లో మెప్పించబోతున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. అలాగే తన వాళ్ల కోసం అజిత్‌ విలన్స్‌తో చేస్తున్న పోరాటాలు, అజిత్‌, త్రిష మధ్య కుదిరిన క్యూట్‌ కెమిస్ట్రీతో పాటు అజర్‌ బైజాన్‌లో చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు అబ్బుర పరుస్తున్నాయి. మరో వైపు అర్జున్‌ జైలులో ఖైదీగా, మరోవైపు స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. రెజీనా కసాండ్ర సైతం ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో అలరిస్తుందని ట్రైలర్‌లో ఆమెను చూస్తుంటేనే తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్‌, నిఖిల్‌ నాయర్‌ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.