నవతెలంగాణ కంఠేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ తెలిపారు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం. నాందేవ్ వాడకి చెందిన మంత్రి రూపేష్ అనే వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.అతను మద్యానికి బానిస అవ్వడంతో అతని భార్య అతనిని వదిలేసింది. అప్పటినుండి రూపేష్ ఇంకా ఎక్కువ మద్యం త్రాగుతూ మద్యానికి బానిస అయ్యాడు. అయితే తేదీ 24న ఉదయం అందాజా నాలుగు గంటలకి రూపేష్ తన జీవితం మీద విరక్తి చెంది యాసిడ్ త్రాగగా అతని తల్లి మమత చికిత్స నిమిత్తం రూపేష్ ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తేదీ 24 న రాత్రి పది గంటలకి చనిపోయినాడు. అతని తల్లి మమత ఇచ్చిన ఫిర్యాదు మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|