1-9-2024 ఆదివారంరోజున రాత్రి మండలంలోని దొంగతృప్తి గ్రామానికి చెందిన పోల గాని ఐలయ్య ఈ నెల ఒకటి ఆదివారం రోజున రాత్రి 7-00 గంటల సమయంలో గొర్రెలను మెపడానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తన పల్సర్ బైక్ నీ అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఐలయ్య నీ ఎదురుగా గుద్దగా, అతడి మెడ , వెన్ను పూస, తల కి తీవ్ర రక్త గాయాలు కాగా స్థానికులు అతడిని వెంటనే కరీంనగర్ లోని శ్రీ లక్మి నరసింహ ఆసుపత్రి కి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు గాయాలు తీవ్రంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని అతడి కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని పల్సర్ బైక్, నడుపుతున్న వ్యక్తి పై కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిఫారు