పత్తిలో చీడపురుగులు నివారణ చేపట్టి అధిక దిగుబడి పొందాలి

పత్తిలో చీడపురుగులు నివారణ చేపట్టి అధిక దిగుబడి పొందాలినవతెలంగాణ-టేక్మాల్‌
పత్తిలో చీడపురుగులు నివారణ చేపట్టి అధిక దిగుబడిని పొందాలని వ్యవసాయాధికారి రాంప్రసాద్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని బర్దిపూర్‌ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్‌ పత్తి పంటను సందర్శించి రైతులకు పత్తి యాజమాన్య పద్ధతుల పై అవగాహనా కల్పించారు. పత్తి పంట పై పురుగు ఉదతిని బట్టి పేను బంక ఆశించి ఉంటే థైయోమి థాక్సమ్‌ 0.2 గ్రాములు లీటర్‌ నీటికి, తెల్ల దోమ ఆశించి ఉంటే డై ఫెన్‌ థా యు రాన్‌ 1.25 గ్రాములు లేదా స్పైరొమేసిఫెన్‌ 1 మి. లీ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అని తెలియజేసారు. అదే విదంగా నీటి ముంపుకు గురి అయినా పంటకు త్వరగా కోలుకోవడానికి 19-19-19 లేదా 13-0-45 వారం రోజుల వ్యవదిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. నేల ద్వారా వ్యాపించే తెగులు అరికట్టడానికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ని లీటర్‌ నీటికి కలిపి మొక్క మొదలు తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి అని సూచించారు. ఇందులో రైతులు పాల్గొన్నారు.