– కోర్టులో వివాదం ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ
నవ తెలంగాణ మల్హర్ రావు: కాటారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ కుటుంబం పురుగుల మందు డబ్బతో ఆందోళన దిగింది. తమ భూమిని ఇతరులకు పట్టా చేయడంతో కోర్టును ఆశ్రయించామని ఈ క్రమంలోనే తమకు తెలియకుండానే అధికారులు రిజిస్ట్రేషన్ చేశారని కాటారంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి శ్యామలతో ఆమె కుమార్తెలు పూజ, తేజొరాణి మంగళవారం ఆందోళన చేపట్టారు. వారి కథనం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాటారం రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 202/ఏ లో తోటపల్లి వెంకట్ రెడ్డికి 4 ఎకరాల 3 గంటల భూమి ఉంది. ఇందులో నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం 20 గుంటల భూమిని అధికారులు సేకరించారు 2022 డిసెంబర్ లో అప్పటి తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనివాస్ పలుమార్లు వెంకట్ రెడ్డిని పిలిచి భూమిని పట్టా ఎలా చేసుకున్నావు అని ప్రశ్నించారు.
పైప్ లైన్ కింద పోయిన 20 గుంటలను ధరణిలో తీసివేయాలి కదా అంటూ డిసెంబర్ 30న స్లాట్ బుక్ చేయించి పేపర్లపై తహశీల్దార్ సంతకాలు చేయించారు. సాయంత్రం ఆన్ లైన్ ధరణి వెబ్ సైట్ లో వెంకట్ రెడ్డి కూతురు చూడగా ఆయన పేరిట కేవలం 1 ఎకరం 27 గంటల భూమి ఉంది. తోటపల్లి సమ్మయ్యకు 1 ఎకరం 8 గంటలు, తోటపల్లి దేవేందర్ కు 1 ఎకరం 8 గంటలు ఉన్నట్లుగా గుర్తించి తండ్రితో చెప్పింది. దీంతో లబోదిబోమంటు వెంకట్ రెడ్డి తహశీల్దార్ దగ్గరకు వెల్లుతాడు.ని భూమి నికే చేస్తానంటూ తహశీల్దార్ దాటవేశాడు.ఈ క్రమంలో ఆయన బదిలీ అయ్యారు. తన భూమిపై జరిగిన విషయంపై వెంకట్ రెడ్డి పోలీస్ స్టేషన్ తోపాటు తహశీల్దార్ కార్యాలయంలో పిర్యాదు చేశాడు.దీనిపై ప్రస్తుత తహశీల్దార్ నాగరాజు సమాచారం ఇస్తూ గతంలో పట్టా మార్పిడి చేసుకున్న తోటపల్లి సమ్మయ్య వేరొక్కరికి పట్టా మార్పు చేయాలని స్లాట్ బుక్ చేసుకున్నాడని తెలిపారు.
ఈ భూ వివాదంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామని ఇటీవల హైకోర్టులో రిట్ పిటీషన్ కూడా దాఖలు చేశామని అలాంటప్పుడు ఈ నెల 9న పట్టా మార్పిడి ఎలా చేస్తారని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతడి భార్య,కూతుళ్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలో ఆందోళనకు దిగారు.తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై తహశీల్దార్ నాగరాజు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాటారం ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో అక్కడకు చేరుకుని నిరసన కారులతో మాట్లాడారు దీనిపై తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ పట్టా కలిగి ఉన్నవారు స్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిoదేన్నారు.రెండున్నర నెలలుగా పెండింగ్ లో పెడుతున్నారంటూ పట్టాదారు కలెక్టర్ కు పిర్యాదు చేశాడని, కలెక్టర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేశామని స్పష్టం చేశారు.
ఆ భూమిపై కోర్టు ద్వారా స్టేటస్ కో గాని,ఇంజక్షన్ ఆర్ధర్ కానీ ఏమీ లేవని,రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నవారికి ధరణి రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలసిందేన్నారు.తాను ఈ భూమి విషయంలో ఏ పొరపాటు చేయలేదని తెలిపారు.దీంతో పోలీసులు మహిళల వద్ద ఉన్న మందు డబ్బాను తీసుకొని శాంతింప చేసేందుకు యత్నించారు. కలెక్టర్ ను కలిసి విన్నవించుకోవడమే కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవడమే చేయాలని చూసిస్తూ ధర్నా విరమింపజేశారు.