జాతీయస్థాయి పుస్తక సమీక్ష పోటీల్లో “పేట” విద్యార్ధి ప్రతిభ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉరిమళ్ళ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పుస్తక సమీక్ష పోటీలలో అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ కవి,రచయిత,పుస్తక సమీక్షకులు సిద్దాంతపు ప్రభాకాచార్యులు తనయుడు, బాల కథకుడు సాత్విక్ సాయికుమార్ ప్రతిభ కనబరిచాడు. బహుమతి సైతం బహుమతి లభించింది. ఈ మేరకు ఉరిమళ్ళ ఫౌండేషన్ నిర్వాహకులు భోగోజు ఉపేంద్ర, ఉరిమళ్ళ సునంద లు సాత్విక్ కు  సమాచారం అందించారు. అమ్మిన శ్రీనివాసరాజు వ్రాసిన చంద్ర వంకలు అనే బాలల కథా సంపుటి పై సమీక్ష వ్రాసి పోటీలకు పంపించాడు. జాతీయస్థాయిలో 200 మందికి పైగా విద్యార్ధులు పాల్గొన్న ఈ పోటీలో 34 ఉత్తమ సమీక్షలను ఎంపిక చేసినట్లునిర్వాహకులు తెలిపారు. సాత్విక్ స్థానిక సూర్య స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు.ఉరిమళ్ల ఫౌండేషన్ త్వరలో నిర్వహించబోయే బహుమతి ప్రధానోత్సవ సభలో బహుమతిని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాత్విక్ కు బహుమతి లభించడం పట్ల యం.ఇ.ఒ  పి. కృష్ణయ్య, సూర్య పాఠశాల కరస్పాండెంట్ పోతన రాంబాబు, ప్రధానోపాధ్యాయులు నాగరాజు  సాత్విక్ ను అభినందించారు.