మధ్యాహ్న భోజన నిర్వాకురాలిని మార్చాలని వినతిపత్రం అందజేత

Petition for change of midday meal managerనవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల యందు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాకురాలిని మార్చాలని శుక్రవారం పాఠశాల యందు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించినారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పని చేస్తున్న ఏజెన్సీ నిర్వాకురాలు రోజువారి మేను ప్రకారం వంట చేయడం లేదని, మధ్యాహ్న భోజనంలో పురుగులు, వెంట్రుకలు రావడం జరుగుతుందని, కోడిగుడ్లు, రాగి జావా పెట్టకపోవడం జరుగుతుందని, భోజన సమయంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం వంట సరిగా చేయమని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తుందని, దీంతో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి మధ్యాహ్న భోజన ఏజెన్సీని మార్చాలని తీర్మానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని మార్చాలని పాఠశాల  ప్రధ నొ పాధ్యాయురాలు వనజ , తహసీల్దార్ ,మండల విద్యాధికారి, మున్సిపల్ కమిషనర్లకు సైతం వినతి పత్రాలు అందజేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,  విద్యార్థినుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.