
జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్
నవతెలంగాణ – వేములవాడ బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ అవుతున్న నిరుద్యోగుల కొరకు స్టడీ సర్కిల్ & లైబ్రరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చాలాసార్లు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పాలకులను, అధికారులు తీరుపై బహుజన సేన ఆర్గనైజేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తూ, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరిస్తూ విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిందిగా కోరుకున్నారు..
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండా శ్యామ్, కోనరావుపేట మండల అధ్యక్షులు దప్పుల ప్రేమ్ కుమార్, వేములవాడ మండల అధ్యక్షుడు అన్నవేణి రంజిత్ ముదిరాజ్, చందుర్తి మండల అధ్యక్షుడు లక్కె సాగర్, పడిగెల అనిల్, సందు శ్రీనివాస్, అలువాల రాము, కుమ్మరి దీపక్, మల్లారం హరీష్, నితిన్, అరుణ్, కిషన్, అరవింద్, శ్రీకాంత్, విష్ణు, పావన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు*