రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తాసిల్దార్ కు వినతి పత్రం

నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం ఇవ్వాలని,24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్ అమలు చేయాలని సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పండించిన పంటలు తుది దశలో ఉన్నాందువల్ల ఇంకో తడి ఎస్సారెస్పీ కాలువ ద్వార నీరు ఇవ్వాలని,ఇతరత్ర రైతాంగ సమస్యలని తక్షణమే పరిష్కరించాలన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన బోనస్, రైతు భరోసా తదితర ఎన్నికల వాగ్ధాలన్ని సత్వరమే అమలుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దాసరపు నరేందర్,కొయ్యడ అశోక్,మండల దళిత మోర్చా అధ్యక్షులు కనకం సాగర్, ఓ బి సి మోర్చా మండల ప్రధాన కార్యదర్శి నిమ్మశెట్టి సంపత్,సీనియర్ నాయకులు దొంగల రాములు,ఎల్కపల్లి సంపత్,పల్లె శివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.