నవతెలంగాణ-ఓయూ: తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్.వి. బాలకిష్టా రెడ్డిని గురువారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణా రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సూర్యచందర్ , అధ్యక్షుడు కట్టా వెంకటేష్ , జనరల్ సెక్రెటరీస్ అరుణ్ కుమార్, తక్కెళ్ల చేతన్ ,కో.కన్వీనర్ చేర్యాల శ్రీనివాస్, వీణా,అరవింద్, మౌళీ, సతీశ్, రాగిణి, నరేందర్ ,బాలరాజు, రాజ్యలక్ష్మి, రాము కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.