మంత్రికి ముదిరాజ్ కులస్తుల వినతి

నవతెలంగాణ-ముత్తారం: ముత్తారం గ్రామ ముదిరాజ్ కులస్తులకు సంబంధించిన ఇంటి స్థలాలను పట్టాలు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ముదిరాజ్ కులస్తులు మంగళవారం వినతి అందజేశారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీ ధర్ బాబును వారు కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పట్టాలు మంజూరు చేయించేందుకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. వినతి అందజేసిన వారిలో మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, మాజీ సర్పంచ్ తాటిపాముల వకులరాణి శంకర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బొల్నేని బుచ్చంరావు, ముదిరా జ్ సొసైటీ సెక్రటరీ కుక్కల చందు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.