నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీ గుడిసె వాసులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇండ్ల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయల కేటాయించాలని శనివారం వినతిపత్రం అందించారు. ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించేందుకు ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలోని గుడిసె వాసులకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు, కరెంటు మీటరు మరియు ఇంటి నెంబర్లను కేటాయించే విధంగా సహకరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. డబుల్ బెడ్ రూమ్ ప్రక్రియలో భాగంగా నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్, సావిత్రి, సుశీల తదితరులు ఉన్నారు.